- భారత పర్యటనలో ఉన్న కెనడా ప్రధాని మార్క్ కార్నీ 2026, మార్చి 2న ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఇద్దరు నేతల ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా యురేనియం, కీలక ఖనిజాల సరఫరా సహా పలు కీలక ఒప్పందాలపై భారత్-కెనడా దేశాలు సంతకాలు చేశాయి. రక్షణ, అణు రియాక్టర్లు, విద్య, పునరుత్పాదక ఇంధనం.. తదితర రంగాల్లో సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని నిర్ణయించారు.
- 2030 కల్లా వార్షిక ద్వైపాక్షిక వాణిజ్యం 50 బిలియన్ డాలర్లకు చేర్చాలన్నదే లక్ష్యమని.. ఇందుకోసం త్వరలోనే సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంటామని మోదీ తెలిపారు.