Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Feb 18, 2026
Current Affairs
మోదీతో మెక్రాన్‌ భేటీ
మోదీతో మెక్రాన్‌ భేటీ
  • ప్రధాని నరేద్ర మోదీతో ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ ముంబయిలోని లోక్‌భవన్‌లో  ద్వైపాక్షిక చర్చలు జరిపారు. వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేయడం, సరికొత్త రంగాలకు వాటిని విస్తరించడం, భాగస్వామ్యంలో పురోగతిపై సమాలోచనలు జరిపారు. ఈ సందర్భంగా 21 ఒప్పందాలపై సంతకాలు జరిగాయి.
  • భారత్‌లో హామర్‌ క్షిపణుల ఉత్పత్తికి భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్, సాఫ్రాన్‌ (ఫ్రాన్స్‌) మధ్య కుదిరిన ఒప్పందం దీనిలో ఒకటి. ఇరు దేశాల సైన్యాల మధ్య అధికారులను పరస్పరం నియుక్తం చేయడం మరొకటి. ద్వైపాక్షిక చర్చలకు ముందు మెక్రాన్, ఆయన సతీమణి బ్రిజట్‌ తాజ్‌ హోటల్‌ వద్దకు వెళ్లి 26/11 ముంబయి పేలుళ్ల మృతులకు నివాళులర్పించారు.