Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Jan 13, 2026
Current Affairs
మోదీతో ఫ్రెడ్రిక్‌ మెర్జ్‌ భేటీ
మోదీతో ఫ్రెడ్రిక్‌ మెర్జ్‌ భేటీ
  • భారత్‌లో రెండ్రోజుల పర్యటన కోసం వచ్చిన జర్మనీ ఛాన్స్‌లర్‌ ఫ్రెడ్రిక్‌ మెర్జ్‌ 2026, జనవరి 12న అహ్మదాబాద్‌లో ప్రధాని నరేంద్రమోదీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇద్దరూ సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించి, మహాత్ముడికి నివాళులర్పించారు. అనంతరం అంతర్జాతీయ పతంగుల పండగ-2026ను మోదీ ప్రారంభించారు.
  • రక్షణ, భద్రత, వాణిజ్యం, విలువైన ఖనిజాలు, సెమీ కండక్టర్లు, శాస్త్ర-సాంకేతిక రంగాలు, విద్య, నైపుణ్యం, పరిశోధన రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవాలని ఇద్దరు నేతలూ నిర్ణయించుకున్నాయి. ఈ మేరకు రెండు దేశాల మధ్య 19 ఒప్పందాలపై సంతకాలు జరిగాయి.