రెండు రోజుల పర్యటన కోసం భారత్‌కు వచ్చిన దుబాయ్ యువరాజు షేక్ హమ్దాన్ బిన్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ 2025, ఏప్రిల్ 8న దిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా తమ మధ్య రక్షణ సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని భారత్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నిర్ణయించాయి.
అదేవిధంగా సైనిక పరికరాలను సంయుక్తంగా అభివృద్ధి పరిచే అవకాశాలను అన్వేషించాలని అంగీకారానికి వచ్చాయి.