భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి బార్బడోస్ దేశం ప్రతిష్ఠాత్మకమైన ‘ఆనరరీ ఆర్డర్ ఆఫ్ ఫ్రీడం ఆఫ్ బార్బడోస్’ పురస్కారాన్ని ప్రదానం చేసింది.
కొవిడ్ కాలంలో అమూల్య సేవలు, సమర్థ నాయకత్వం అందించినందుకు ఇది అందించినట్లు పేర్కొంది.
బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్‌లో ప్రధాని తరఫున మన దేశ విదేశాంగశాఖ సహాయ మంత్రి పబిత్రా మార్గేరిటా ఈ పురస్కారాన్ని స్వీకరించారు.
ఈ పురస్కారాన్ని మోదీకి ఇవ్వనున్నట్లు బార్బడోస్ ప్రధాని మైయా అమోర్ మోట్లీ 2024, నవంబరు 20న ప్రకటించారు.