Please note, our website will be undergoing scheduled maintenance on Monday, 25th November night from 11:00 PM to 3:00 AM IST (5:30 PM to 9:30 PM UTC) and will be temporarily unavailable. Sorry for the inconvenience.
భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీని కామన్వెల్త్ ఆఫ్ డొమినికా తమ దేశ అత్యున్నత జాతీయ అవార్డు ‘డొమినికా అవార్డ్ ఆఫ్ ఆనర్’తో సత్కరించనుంది. ఈ విషయాన్ని ఆ దేశ ప్రభుత్వం 2024, నవంబరు 14న తెలిపింది.
కొవిడ్ సమయంలో డొమినికాకు భారత్ అందించిన సహకారాన్ని గుర్తిస్తూ ఈ పురస్కారాన్ని అందజేయనున్నట్లు తెలిపింది.
నవంబరు మూడోవారంలో గయానాలో జరిగే ది కరేబియన్ కమ్యూనిటీ అండ్ కామన్ మార్కెట్ సదస్సులో ఆ అవార్డును ప్రదానం చేయనున్నట్లు వెల్లడించింది.