భారత ప్రధాని నరేంద్రమోదీకి కువైట్ ప్రభుత్వం 2024, డిసెంబరు 22న తమ దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘ద ఆర్డర్ ఆఫ్ ముబారక్ ది గ్రేట్’ను ప్రదానం చేసింది.
కువైట్ రాజు షేక్ మెషాల్ అల్-అహ్మద్ అల్-జబేర్ అల్-సబా దీన్ని మోదీకి అందజేశారు.
గతంలో అమెరికా మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్, జార్జ్ బుష్, బ్రిటన్ రాజు ఛార్లెస్ తదితరులు ఈ అవార్డు అందుకున్నారు.
వివిధ దేశాల నుంచి మోదీకి ఇంతవరకు 20 అంతర్జాతీయ పురస్కారాలు లభించాయి.