రెండురోజుల పర్యటన నిమిత్తం 2026, ఫిబ్రవరి 25న ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ చేరుకున్నారు. తొలుత ఆ దేశ ప్రధానమంత్రి నెతన్యాహుతో కొంతసేపు భేటీ అయ్యారు. ఇజ్రాయెల్ పార్లమెంట్ (కనెసెట్)లో మోదీ చరిత్రాత్మక ప్రసంగం చేశారు. భారత ప్రధాని ఇజ్రాయెల్ పార్లమెంటులో ప్రసంగించడం ఇదే తొలిసారి. తమ అత్యున్నత పురస్కారమైన ‘స్పీకర్ ఆఫ్ ది కనెసెట్ మెడల్’తో ఆయన్ను కనెసెట్ గౌరవించింది. భారత్-ఇజ్రాయెల్ మధ్య వ్యూహాత్మక సంబంధాల బలోపేతానికి మోదీ చేసిన కృషికి గుర్తింపుగా ఈ పురస్కారాన్ని ఆయనకు అందజేసినట్లు పార్లమెంట్ తెలిపింది. ఈ మెడల్‌ను అందుకున్న తొలి నేత మోదీయే.