ఇథియోపియా ప్రభుత్వం భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఆ దేశ అత్యున్నత పురస్కారం ‘‘గ్రేట్ ఆనర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియా’’తో సత్కరించింది. అదిస్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఇథియోపియా ప్రధాని డాక్టర్ అబి అహ్మద్ అలీ ఆయనను అవార్డుతో సత్కరించారు. జోర్డాన్ పర్యటనను ముగించుకొని మోదీ 2025, డిసెంబరు 16న ఇథియోపియా రాజధాని అదిస్ అబాబా చేరుకున్నారు.