‘సముద్రయాన్’ ప్రాజెక్టులో భాగంగా దాదాపు 12 గంటల వ్యవధిలో సముద్రంలో 6,000 మీటర్ల లోతుకు వెళ్లి బయటకు వచ్చేందుకు వీలుగా ఓ ప్రత్యేకమైన డైవింగ్ యంత్రాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) సిద్ధం చేసింది. దీనికి మత్స్య-6000 అని పేరు పెట్టింది. అందులో ఉండే సభ్యుల కోసం ప్రత్యేక ఆహారాన్ని కూడా సిద్ధం చేసింది.
* అత్యవసర పరిస్థితులను తట్టుకొనేలా మత్స్య-6000 సబ్‌మెర్సిబుల్ వెహికల్‌ను సిద్ధం చేశారు. సంక్లిష్ట సమయంలో 96 గంటలపాటు సిబ్బంది దీనిలో ఉండొచ్చు. ఇందుకోసం 67 ఆక్సిజన్ సిలిండర్లు పని చేస్తుంటాయి. మొత్తంగా ఇది సముద్రంలోని అత్యంత లోతైన ప్రదేశంలో 108 గంటలు ఉండగలదు. సముద్రగర్భంలోకి వెళ్లడానికి 3 గంటలు, రావడానికి 3 గంటలతో పాటు పరిశోధన కోసం 6 గంటలు ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఈ ప్రాజెక్టు కోసం మన దేశం సుమారు రూ.4,077 కోట్లు వెచ్చిస్తోంది.