Published on Mar 18, 2025
Current Affairs
మొండి బకాయిల రైటాఫ్‌
మొండి బకాయిల రైటాఫ్‌

గత పదేళ్లలో (2014-24) బ్యాంకులు రూ.16.35 కోట్ల విలువైన మొండి బకాయిల (ఎన్‌పీఏ-నిరర్థక ఆస్తుల)ను రైటాఫ్‌ (సాంకేతికంగా రద్దు) చేసినట్లు పార్లమెంటుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు.

ఇలా రైటాఫ్‌ చేసిన మొత్తాలు బ్యాంకు బ్యాలెన్స్‌ షీట్ల నుంచి తొలగిస్తారు మినహా, సదరు రుణగ్రహీత ఖాతా నుంచి మాఫీ కావు. అంటే రుణాలు తీసుకున్న వ్యక్తులు, కంపెనీలు ఆ మొత్తాన్ని చెల్లించాల్సిందే.

ఒక ఖాతాను మొండి ఖాతాగా వర్గీకరించాక, బ్యాంకు బోర్డులు ఆమోదించిన విధానాల ప్రకారం, వివిధ రకాలుగా రికవరీ చర్యలను బ్యాంకులు కొనసాగిస్తాయి.