దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం. రెండేళ్లకోసారి కోలాహలంగా జరిగే ఈ మహా జాతర 2026, జనవరి 28న ప్రారంభమైంది. సమ్మక్క, సారలమ్మ తల్లులు గద్దెలపై కొలువుదీరాయి. తెలంగాణ ప్రభుత్వం రూ.251 కోట్ల నిధులు వెచ్చించి తల్లుల గద్దెల ప్రాంగణాన్ని పునర్నిర్మించడంతో పాటు భక్తులకు అవసరమైన సదుపాయాలు కల్పించింది.
జాతరలో అత్యంత కీలక ఘట్టం సమ్మక్క ఆగమనం. ఆ వనదేవతను జనవరి 29న కొక్కెర కృష్ణయ్య నేతృత్వంలో మేడారం సమీపంలోని చిలుకల గుట్టపై నుంచి తీసుకొచ్చారు.