Published on Nov 11, 2024
Current Affairs
మేటి ఆటగాళ్లుగా హర్మన్‌ప్రీత్, శ్రీజేష్‌
మేటి ఆటగాళ్లుగా హర్మన్‌ప్రీత్, శ్రీజేష్‌

2024 ఏడాదికి గాను అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్‌) మేటి ఆటగాడిగా భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్, ఉత్తమ గోల్‌కీపర్‌గా శ్రీజేష్‌ ఎంపికయ్యారు. 2024.

నవంబరు 9న లాసానెలో జరిగిన 49వ ఎఫ్‌ఐహెచ్‌ కాంగ్రెస్‌లో వారు ఈ అవార్డులు స్వీకరించారు. ఈ ఇద్దరూ ఎఫ్‌ఐహెచ్‌ అవార్డులకు ఎంపికవడం ఇది మూడోసారి. 2020-21, 2021-22లోనూ వీళ్లు ఈ పురస్కారాలు సొంతం చేసుకున్నారు.