Published on Nov 11, 2024
Current Affairs
మొజాంబిక్‌ దేశానికి భారత ఎఫ్‌ఐసీ బోట్లు
మొజాంబిక్‌ దేశానికి భారత ఎఫ్‌ఐసీ బోట్లు

హిందూ మహాసముద్ర ప్రాంత దేశాలతో స్నేహపూర్వక సంబంధాలను పెంచుకోవడంలో భాగంగా మొజాంబిక్‌ దేశానికి భారత ప్రభుత్వం రెండు ఫాస్ట్‌ ఇంటర్‌సెప్టర్‌ క్రాఫ్ట్‌(ఎఫ్‌ఐసీ) బోట్లను కానుకగా అందజేసింది.

2024 నవంబరు 8న మొజాంబిక్‌ ప్రభుత్వానికి అధికారికంగా వాటిని అప్పగించినట్లు నేవీ వర్గాలు తెలిపాయి. ఈ ఫాస్ట్‌ వాటర్‌ జెట్‌ ప్రొపల్షన్‌ బోట్లు సముద్ర జలాల్లో 45 నాటికల్‌ మైళ్ల వేగంతో దూసుకుపోతాయని నేవీ వర్గాలు వెల్లడించాయి.