మొజాంబిక్ మానవ హక్కుల కార్యకర్త, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా రెండో భార్య గ్రాసా మచెల్... ఇందిరాగాంధీ శాంతి పురస్కారానికి ఎంపికయ్యారు. 2025 ఏడాదికి గానూ శాంతి, నిరాయుధీకరణ, అభివృద్ధి విభాగంలో మచెల్‌కు బహుమతిని ప్రదానం చేస్తున్నట్లు ఇందిరాగాంధీ మెమోరియల్ ట్రస్టు 2026, జనవరి 21న తెలిపింది.
విద్యా, ఆరోగ్యం, పోషకాహారం, ఆర్థిక సాధికారత సహా పలు కీలక రంగాల్లో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొని ఆమె చేసిన కృషికిగాను మచెల్‌కు ఈ పురస్కారాన్ని అందిస్తున్నట్లు పేర్కొంది.