Published on Jul 23, 2025
Current Affairs
మిగ్‌-21
మిగ్‌-21

భారత వాయుసేనకు 60 ఏళ్లపాటు వెన్నెముకగా నిలిచిన మిగ్‌-21 యుద్ధవిమానాలను సర్వీసు నుంచి పూర్తిగా ఉపసంహరించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

సెప్టెంబరు 19న చండీగఢ్‌లోని వైమానిక స్థావరంలో జరిగే ఒక కార్యక్రమంలో వీటి సేవలకు లాంఛనంగా స్వస్తి పలకనున్నట్లు వివరించాయి.

అక్కడి 23వ స్క్వాడ్రన్‌లో ఈ జెట్‌లు భాగంగా ఉన్నాయి. 

మిగ్‌-21 యుద్ధవిమానాన్ని రష్యా (నాటి సోవియట్‌ యూనియన్‌)కు చెందిన మికోయన్‌-గురేవిచ్‌ సంస్థ రూపొందించింది.

ఇది 1955 జూన్‌ 16న మొదట గగనవిహారం చేసింది.

1959 నుంచి 1985 వరకూ వీటి ఉత్పత్తి సాగింది.

గరిష్ఠ వేగం గంటకు 2,230 కిలోమీటర్లు. 

ప్రపంచవ్యాప్తంగా 60కిపైగా దేశాలకు ఇవి సేవలందించాయి.

మొత్తంమీద 11,496 మిగ్‌-21లను రష్యా ఉత్పత్తి చేసింది.

ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ సంఖ్యలో ఉత్పత్తయిన సూపర్‌సోనిక్‌ యుద్ధవిమానంగా ఇది చరిత్ర సృష్టించింది.

అలాగే ఎక్కువ యుద్ధాల్లో పాల్గొన్న ఫైటర్‌ జెట్‌గా కూడా గుర్తింపు పొందింది.