ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) డైరెక్ట్ ప్రాతిపదికన గ్రూపు ఎ, బి, సి పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 93
వివరాలు:
గ్రూపు - ఎ పోస్టులు:
1. మెడికల్ ఆఫీసర్: 02
2. మెడికల్ ఫిజిసిస్ట్: 02
3. సైకాలజిస్ట్: 02
గ్రూపు-బి పోస్టులు:
4. ప్రోగ్రామర్: 01
5. స్టోర్ కీపర్: 01
6. జూనియర్ ఇంజినీర్: 01
7. లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్: 01
8. మెడికల్ సోషల్ సర్వీస్ (ఆఫీసర్ గ్రేడ్-2): 02
9. పెర్ఫ్యూషనిస్ట్ : 01
10. అసిస్టెంట్ డైటీషియన్: 02
11. టెక్నీషియన్: 24
12. ఎంబ్రియాలజిస్ట్: 01
13. అసిస్టెంట్: 02
గ్రూపు-సి పోస్టులు:
14. న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజిస్ట్: 01
15. ఎల్‌డీసీ: 05
16. అటెండెంట్: 04
17. హాస్పిటల్ అటెండెంట్ (గ్రేడ్-3): 40
18. స్టెనోగ్రాఫర్: 01
విభాగాలు: ఆయుష్, రేడియేషన్ థెరపీ/ అంకాలజీ, న్యూక్లియర్ మెడిసిన్, క్లినికల్/ చైల్డ్, ఏసీ/ రిఫ్రిజిరేటర్, ల్యాబొరేటరీ, హైజినిస్ట్, మార్చురీ, ఎగ్జిక్యూటివ్/ పర్సనల్
తదితరాలు.
అర్హత: ఇంటర్మీడియట్, పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ (బీఎస్సీ), బీఈ/బీటెక్, ఎంబీబీఎస్, పీజీ (ఎంఎస్సీ/ ఎంఏ), పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయో పరిమితి: 18-35 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ ఐదేళ్లు, ఓబీసీ మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్లు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: రూ.1500; ఎస్సీ/ఎస్టీలకు రూ.1000; దివ్యాంగ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
గ్రూపు-ఎ పోస్టులకు సంబంధించిన దరఖాస్తులను ‘రిక్రూట్‌మెంట్ సెల్, రూమ్ నంబర్: 205, రెండో అంతస్తు, లైబ్రరీ అండ్ అడ్మిన్ బిల్డింగ్, ఎయిమ్స్ మంగళగిరి, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్’ చిరునామాకు పంపించాలి.
ఎంపిక ప్రక్రియ: గ్రూపు ఎ పోస్టులకు ఇంటర్వ్యూ, గ్రూపు బి, సి పోస్టులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆధారంగా.
ఆఫ్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 29.10.2024