మైక్రోసాఫ్ట్ వాణిజ్య వ్యాపారాలకు ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ)గా జడ్సన్ అల్తాఫ్‌ను నియమించారు.
మైక్రోసాఫ్ట్ వాణిజ్య ఉత్పత్తులకు చెందిన అన్ని విక్రయాలు, మార్కెటింగ్, కార్యకలాపాలతో పాటు ఏఐ కోపైలట్ సూట్ వ్యవహారాలనూ అల్తాఫ్ పర్యవేక్షిస్తారు.
మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ప్రత్యేకంగా సాంకేతిక పనులపైనే దృష్టి పెట్టే నిమిత్తం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ ప్రకటించింది.