రాష్ట్రంలోని యువతకు కృత్రిమ మేధ(ఏఐ)లో శిక్షణను ఇప్పించి వారిలో సాంకేతిక నైపుణ్యాన్ని పెంచేందుకు అంతర్జాతీయ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌తో ఏపీ ప్రభుత్వం 2025, మార్చి 13న కీలక ఒప్పందం చేసుకుంది.
రాష్ట్ర సచివాలయంలో విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ సమక్షంలో మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు, రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.
ఈ ఒప్పందం వృత్తి విద్య, మాధ్యమిక పాఠశాలల విద్యార్థులు, యువతలో ఏఐ, అధునాతన సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించి, పరిశ్రమలకు అవసరమైన సిబ్బందిని తయారు చేసేందుకు ఉపయోగపడుతుంది.