రాంచీలోని మెటలర్జికల్ అండ్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ లిమిటెడ్ (మెకాన్ లిమిటెడ్) ఒప్పంద ప్రాతిపదికన ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 15
వివరాలు:
1. డిప్యూటీ మేనేజర్ (ఈ-2 గ్రేడ్) : 08
2. మేనేజర్ (ఈ-3 గ్రేడ్) : 05
3. సీనియర్ మేనేజర్ (ఈ-4 గ్రేడ్) : 02
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీ.ఆర్కిటెక్, బీఈ/బీటెక్ (మెకానికల్/ సివిల్/ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రికల్/ కెమికల్), పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: డిప్యూటీ మేనేజర్ పోస్టులకు 32 ఏళ్లు; మేనేజర్ పోస్టులకు 36 ఏళ్లు; సీనియర్ మేనేజర్ పోస్టులకు 40 ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
జీతం: నెలకు డిప్యూటీ మేనేజర్ పోస్టులకు రూ.60,000- రూ.1,80,000; మేనేజర్ పోస్టులకు రూ.80,000- రూ.2,20,000; సీనియర్ మేనేజర్ పోస్టులకు రూ.90,000- రూ.2,40,000.
దరఖాస్తు ఫీజు: రూ.1000; ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన, తదితరాల ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 13-11-2024.
Website:http://www.meconlimited.co.in/