పంటల ఉత్పాదకత పరంగా ఆంధ్రప్రదేశ్ మొక్కజొన్నలో దేశంలో తొలిస్థానంలో, వరి, మినుము పంటల్లో రెండో స్థానంలో నిలిచింది. 2024-25 లెక్కల ప్రకారం కేంద్ర వ్యవసాయశాఖ సహాయమంత్రి రామ్‌నాథ్ ఠాకూర్ 2025, డిసెంబరు 2న లోక్‌సభలో ఈ విషయం వెల్లడించారు. కంది ఉత్పాదకతలో దేశంలో ఏపీ అట్టడుగున ఉంది. శనగలో 12, పెసలులో 6, వేరుశనగలో 13, సోయాబిన్‌లో 7, చెరకులో 4, పత్తిలో 9వ స్థానంలో నిలిచింది.