ప్రముఖ రచయిత, సాహితీవేత్త బేతవోలు రామబ్రహ్మం 2024, ఆగస్టు 29న కేంద్ర సాహిత్య అకాడమీ భాషా సమ్మాన్ అవార్డు-2021 అందుకున్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ఆ సంస్థ అధ్యక్షుడు మాధవ్ కౌశిక్ ఆయనకు అవార్డు ప్రదానం చేసి సత్కరించారు. ప్రాచీన, మధ్యయుగ సాహిత్యానికి ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా సాహిత్య అకాడమీ దీన్ని అందజేసింది.
* 1948లో పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్లలో జన్మించిన రామబ్రహ్మం సంస్కృతం, ఆంధ్రంలో విశేష పాండిత్యం గడించారు.