భారత పర్వతారోహకురాలు భావనా దెహరియా దక్షిణ అమెరికా ఖండంలోనే అత్యంత ఎత్తయిన అకోన్‌కాగ్వా పర్వతాన్ని అధిరోహించారు. 6,961 మీటర్ల ఎత్తు కలిగిన ఈ పర్వతం అర్జెంటీనాలో ఉంది.
మహిళా సాధికారత, స్త్రీ-పురుష సమానత్వం కోసం కృషి చేస్తున్న భావనా ఇప్పటివరకు అయిదు పర్వతాలను అధిరోహించారు. ఏడు ఖండాల్లోని ఏడు అత్యున్నత పర్వత శిఖరాలపై కాలుమోపాలన్నది ఆమె లక్ష్యం.
అకోన్‌కాగ్వాకు ముందు ఆమె ఎవరెస్టు (ఆసియా), కిలిమంజారో (ఆఫ్రికా), కాజియోస్కో (ఆస్ట్రేలియా), ఎలబ్రస్ (ఐరోపా)లను అధిరోహించారు.