Published on Apr 21, 2025
Current Affairs
భెల్‌ ఆదాయం రూ.27,350 కోట్లు
భెల్‌ ఆదాయం రూ.27,350 కోట్లు

ప్రభుత్వ రంగ ఇంజినీరింగ్‌ సంస్థ భారత్‌ హెవీ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (భెల్‌) 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.27,350 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. అంత క్రితం ఆర్థిక సంవత్సరం నమోదు చేసిన ఆదాయంతో పోలిస్తే ఇది 19 శాతం అధికం. గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో కంపెనీ గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా రూ.92,534 కోట్ల ఆర్డర్లను దక్కించుకుంది. దీంతో 2024-25 ఆర్థిక సంవత్సరం పూర్తయ్యేసరికి భెల్‌ మొత్తం ఆర్డర్‌ బుక్‌ రూ.1,95,922 కోట్లకు చేరింది.