Published on Jan 22, 2025
Government Jobs
భెల్‌లో ఇంజినీర్‌ ట్రైనీ పోస్టులు
భెల్‌లో ఇంజినీర్‌ ట్రైనీ పోస్టులు

భారత ప్రభుత్వ రంగ సంస్థ- భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ (బీహెచ్‌ఈఎల్)ఒప్పంద ప్రాతిపదికన ఇంజినీర్‌ ట్రైనీ, సూపర్‌వైజర్‌ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 400

వివరాలు:

ఇంజినీర్‌ ట్రైనీలు- 150 

విభాగాల వారీ ఖాళీలు:

1. మెకానికల్‌- 70

2. ఎలక్ట్రికల్‌- 25

3. సివిల్‌- 25

4. ఎలక్ట్రానిక్స్‌- 20

5. కెమికల్‌- 05

6. మెటలార్జీ- 05

సూపర్‌వైజర్‌ ట్రైనీ- 250

1. మెకానికల్‌- 140

2. ఎలక్ట్రికల్‌- 55

3. సివిల్‌- 35

4. ఎలక్ట్రానిక్స్‌- 20

అర్హత: ఇంజినీర్‌ ట్రైనీ పోస్టులకు ఇంజినీరింగ్‌/ టెక్నాలజీలో ఫుల్‌టైం బ్యాచిలర్‌ డిగ్రీ లేదా సంబంధిత విభాగంలో ఇంటిగ్రేటెడ్‌ మాస్టర్‌ డిగ్రీ, డ్యూయల్‌ డిగ్రీ ఉత్తీర్ణత. సూపర్‌వైజర్‌ పోస్టులకు సంబంధిత విభాగంలో రెగ్యులర్‌ ఇంజినీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణత కలిగి ఉండాలి.

వయోపరిమితి: 01-02-2025 నాటికి 27 సంవత్సరాలు మించకూడదు.

ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్‌ బేస్డ్‌ ఎగ్జామినేషన్‌, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా.

బేసిక్‌ పే: ఇంజినీర్‌ ట్రైనీ పోస్టులకు నెలకు రూ.50,000; సూపర్‌వైజర్‌ ట్రైనీ పోస్టులకు నెలకు రూ.32,000.

దరఖాస్తు ఫీజు: యూఆర్‌/ ఈడబ్ల్యూఎస్‌/ ఓబీసీ అభ్యర్థులకు రూ.1072; ఎస్సీ/ఎస్టీ/ దివ్యాంగులు/ ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ వారికి రూ.472.

ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం: 01.02.2025. 

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 28.02.2025.

పరీక్ష తేదీలు: 2025 ఏప్రిల్‌ 11, 12, 13.

Website:https://www.bhel.com/