Published on Jan 7, 2026
Current Affairs
‘భైరవ్‌’
‘భైరవ్‌’
  • శత్రు స్థావరాలను ధ్వంసం చేసేందుకు భారత సైన్యం ‘భైరవ్‌’ పేరుతో కొత్తగా ప్రత్యేక బలగాలను రంగంలోకి దించింది. లక్ష మందికి పైగా ‘డ్రోన్‌ ఆపరేటర్ల’తో ఈ భారీ మానవ సైన్యాన్ని తయారుచేసింది. భైరవ్‌ దళ ఏర్పాటు వెనుక భారీ వ్యూహం ఉంది. ఇది సాధారణ దళానికి, పారా స్పెషల్‌ ఫోర్సెస్‌కు మధ్య వారధిలా పనిచేస్తుంది. 
  • ఆధునిక యుద్ధాల్లో డ్రోన్ల వినియోగం కీలకంగా మారింది. అందుకే ఈ దళంలోని ప్రతి సైనికుడికి డ్రోన్లను ఆపరేట్‌ చేయడంలో, వాటిని యుద్ధంలో వాడటంలో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. వీరు శత్రువుల భూభాగంలోకి చొరబడి, వారి స్థావరాలను డ్రోన్ల సాయంతో కచ్చితత్వంతో దెబ్బకొట్టగలరు. అత్యంత వేగంగా, దూకుడుగా దాడులు చేయడం వీరి ప్రత్యేకత.