దిల్లీకి చెందిన 21 ఏళ్ల ఆర్యన్ వర్ష్‌నే గ్రాండ్‌మాస్టర్ హోదా సొంతం చేసుకున్న భారత 92వ ఆటగాడిగా నిలిచాడు. అర్మేనియాలో అండ్రానిక్ మార్గరియాన్ టైటిల్‌ను గెలుచుకోవడం ద్వారా అతడు ఈ ఘనత సాధించాడు. టోర్నీలో 8వ రౌండ్లో అంబర్ట్‌సుమియన్‌తో గేమ్‌ను డ్రా చేసుకోవడంతో గ్రాండ్‌మాస్టర్‌కు అవసరమైన మూడో నార్మ్‌ను అతడు సొంతం చేసుకున్నాడు.