పారిస్ ఒలింపిక్స్లో కాంస్యం గెలిచిన భారత హాకీ పురుషుల జట్టుకు ప్రత్యేక పురస్కారం లభించింది. 2024, నవంబరు 8న మస్కట్లో జరిగిన అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) కాంగ్రెస్లో ఈ అవార్డుతో భారత జట్టును గౌరవించారు.
ఎఫ్ఐహెచ్ అధ్యక్షుడు తయ్యబ్ ఇక్రమ్, ఫ్రెంచ్ హాకీ సమాఖ్య చీఫ్ ఇసబెల్లె చేతుల మీదుగా హాకీ ఇండియా కార్యదర్శి భోళనాథ్ సింగ్ ఈ పురస్కారాన్ని స్వీకరించాడు.