Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Feb 16, 2026
Government Jobs
భారత సైన్యంలో అగ్నివీర్ కొలువులు
భారత సైన్యంలో అగ్నివీర్ కొలువులు

భారత సైన్యం అగ్నిపథ్ పథకం కింద 2027 రిక్రూట్‌మెంట్ ఏడాదికి గాను అగ్నివీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అగ్నివీర్ల ఎంపిక కోసం రిక్రూటింగ్ కార్యాలయాలు (హెడ్ క్వార్టర్స్) గుంటూరు, సికింద్రాబాద్‌, విశాఖపట్నం నోటిఫికేషన్ విడుదల చేశాయి. అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి ఈ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 

వివరాలు:

విభాగాలు & విద్యార్హతలు:

అగ్నివీర్ (జనరల్ డ్యూటీ): 10వ తరగతిలో కనీసం 45 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.

అగ్నివీర్ (టెక్నికల్): ఇంటర్మీడియట్ (సైన్స్)లో ఫిజిక్స్, మ్యాథ్స్, ఇంగ్లిష్ తో పాటు కనీసం 50 శాతం మార్కులు సాధించాలి లేదా సంబంధిత టెక్నికల్ డిప్లొమా కలిగి ఉండాలి.

అగ్నివీర్ (క్లర్క్/స్టోర్ కీపర్ టెక్నికల్): ఏ విభాగంలోనైనా ఇంటర్మీడియట్ 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి.

వయోపరిమితి: 17 1/2 ఏళ్ల నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి. (01 జులై 2005 నుంచి 01 జులై 2009 మధ్య జన్మించి ఉండాలి). 

అగ్నివీర్ (ట్రేడ్స్‌మెన్): 8వ లేదా 10వ తరగతి ఉత్తీర్ణులైన వారు అర్హులు.

శారీరక ప్రమాణాలు: అభ్యర్థులు కనీసం 162 సెం.మీ నుంచి 170 సెం.మీ ఎత్తు ఉండాలి. ఎత్తుకు తగ్గ బరువు (BMI ప్రకారం) & 5 సెం.మీ ఛాతీ విస్తరణ సామర్థ్యం కలిగి ఉండాలి.

ఎంపిక విధానం: అగ్నివీర్ ఎంపిక ప్రక్రియ రెండు దశల్లో నిర్వహిస్తారు.

మొదటి దశ - ఆన్‌లైన్ పరీక్ష (Phase-I):

నిర్దేశించిన కేంద్రాలలో కంప్యూటర్ ఆధారిత 'ఆన్‌లైన్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (CEE)' నిర్వహిస్తారు.

ఇది మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలతో కూడిన ఆబ్జెక్టివ్ పరీక్ష.

ఈ పరీక్షను తెలుగుతో పాటు మొత్తం 13 భాషల్లో రాసే అవకాశం ఉంటుంది.

అగ్నివీర్ క్లర్క్/స్టోర్ కీపర్ పోస్టులకు దరఖాస్తు చేసే వారికి టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుంది.

రెండవ దశ - రిక్రూట్‌మెంట్ ర్యాలీ:

ఆన్‌లైన్ పరీక్షలో మెరిట్ సాధించిన అభ్యర్థులను తదుపరి దశకు ఎంపిక చేస్తారు.

ఇందులో ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ (1.6 కి.మీ పరుగు, పుల్ అప్స్ మొదలైనవి), ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ & మెడికల్ పరీక్షలు నిర్వహిస్తారు.

జీత భత్యాలు & ఇతర ప్రయోజనాలు:

ఎంపికైన అభ్యర్థులకు 4 ఏళ్ల కాలపరిమితికి గానూ ప్రతి సంవత్సరం పెరిగేలా వార్షిక ప్యాకేజీ ఉంటుంది.

నెలవారీ ప్యాకేజీ (సుమారుగా):

మొదటి సంవత్సరం: నెలకు రూ.30,000 (చేతికి రూ.21,000 అందుతుంది. రూ.9,000 నిధికి జమ అవుతుంది).

రెండవ సంవత్సరం: నెలకు రూ.33,000 (చేతికి రూ.23,100 అందుతుంది. రూ.9,900 నిధికి జమ అవుతుంది).

మూడవ సంవత్సరం: నెలకు రూ.36,500 (చేతికి రూ.25,550 అందుతుంది. రూ.10,950 నిధికి జమ అవుతుంది).

నాల్గవ సంవత్సరం: నెలకు రూ.40,000 (చేతికి రూ.28,000 అందుతుంది. రూ.12,000 నిధికి జమ అవుతుంది).

సేవా నిధి ప్యాకేజీ: 4 ఏళ్ల సర్వీసు పూర్తయిన తర్వాత, అభ్యర్థి జమ చేసిన మొత్తానికి సమానమైన మొత్తాన్ని ప్రభుత్వం కలిపి, వడ్డీతో సహా సుమారు రూ.10.04 లక్షలు 'సేవా నిధి' రూపంలో అందజేస్తుంది.

అలవెన్సులు: ప్యాకేజీతో పాటు రిస్క్ అండ్ హార్డ్‌షిప్, రేషన్, డ్రెస్ & ట్రావెల్ అలవెన్సులు వర్తిస్తాయి.

బీమా: సర్వీసులో ఉన్న కాలంలో అభ్యర్థులకు రూ.48 లక్షల నాన్-కంట్రిబ్యూటరీ లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ అందించబడుతుంది.

ఇతర ప్రయోజనాలు: సంవత్సరానికి 30 రోజుల సెలవు (Annual Leave), అనారోగ్య సెలవు (వైద్యుల సలహా మేరకు), & సి.ఎస్.డి (CSD) క్యాంటీన్ సౌకర్యాలు కల్పిస్తారు.

ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్: 13 ఫిబ్రవరి 2026 నుంచి 01 ఏప్రిల్ 2026 వరకు.

ఆన్‌లైన్ పరీక్ష తేదీలు: 01 జూన్ నుంచి 15 జూన్ 2026 వరకు. (తాత్కాలికం).

Website: https://www.joinindianarmy.nic.in/Authentication.aspx