Published on Oct 13, 2025
Current Affairs
భారత సైన్యానికి ‘విద్యుత్‌ రక్షక్‌’పై పేటెంట్‌
భారత సైన్యానికి ‘విద్యుత్‌ రక్షక్‌’పై పేటెంట్‌

భారత సైన్యానికి చెందిన సమీకృత జనరేటింగ్‌ మానిటరింగ్, ప్రొటెక్షన్‌ అండ్‌ కంట్రోల్‌ సిస్టమ్‌ ‘విద్యుత్‌ రక్షక్‌’కు పేటెంట్‌ హక్కు కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.

ఇటీవల దీన్ని మేజర్‌ రాజ్‌ప్రసాద్‌ ఆర్‌ఎస్‌ అభివృద్ధి చేశారు.

సంక్లిష్ట పరిస్థితుల్లో విద్యుత్తు వ్యవస్థలను కాపాడటంలో ఇది కీలకపాత్ర పోషిస్తుంది.

బహుళ జనరేటర్లు, పవర్‌ సిస్టమ్‌ల సమగ్ర పర్యవేక్షణ, రక్షణ, నియంత్రణలకు ఇది ఉపయోగపడుతుంది.

భారత సైన్యానికి ‘విద్యుత్‌ రక్షక్‌’పై 2023 నుంచి 20 ఏళ్లపాటు ఈ పేటెంట్‌ హక్కును కల్పించారు.