ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో భారత స్థూల దేశీయోత్పత్తి 7.3 శాతంగా నమోదవ్వొచ్చని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) అంచనా వేసింది. 2025 అక్టోబరు అంచనాల్లో మన వృద్ధిరేటు 6.6 శాతంగా ఉండొచ్చని చెప్పిన సంస్థ, 0.7% మేర పెంచింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2026-27), 2027-28కి వృద్ధిరేటు అంచనాను 6.2% నుంచి 6.4 శాతానికి పెంచింది.
2025-26లో భారత్ ఆర్థిక వ్యవస్థ 7.4% వృద్ధిని నమోదు చేయొచ్చని గణాంకాల శాఖ ముందస్తు అంచనాల్లో పేర్కొంది. 2024-25లో వృద్ధిరేటు 6.5%గా ఉంది.