Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Jan 31, 2026
Government Jobs
భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు
భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బీఎస్‌ఎన్‌ఎల్‌) డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ ట్రెయినీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టుల  సంఖ్య: 120

వివరాలు:

1. సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ ట్రెయినీ (టెలికమ్‌): 95

2. సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ట్రెయినీ (ఫైనాన్స్‌): 25

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్‌, సీఏ/సీఎంఏలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 2026 మార్చి 7వ తేదీ నాటికి 21 నుంచి 30 ఏళ్లు ఉండాలి.

వేతనం: నెలకు రూ.24,900 - రూ.50,500.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.2,500, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.1,250.

ఆన్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2026 మార్చి 7.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్ టెస్ట్‌ (సీబీటీ) ఆధారంగా.

దరఖాస్తు సవరణ తేదీ: మార్చి 8 నుంచి 15 వరకు.

పరీక్ష తేదీ: 2026 మార్చి 29.

Website:https://bsnl.co.in/aboutus/careers