వాతావరణ మార్పులకు అనుగుణంగా సుస్థిర వ్యవసాయ విధానాల అమలుపై ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఆహార పథకం (యూఎన్‌డబ్ల్యూఎఫ్‌పీ) ద్వారా భారతదేశం, శ్రీలంక మధ్య ఒప్పందం కుదిరింది.
2025, ఏప్రిల్ 15న అమరావతి సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ ఎక్స్‌అఫిషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, యూఎన్‌డబ్ల్యూఎఫ్‌పీ భారతదేశ ప్రతినిధి, సంచాలకులు ఎలిజబెత్ ఫౌర్ పాల్గొని ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.
ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడులో ఐదేళ్లపాటు దీన్ని అమలు చేస్తారు.