Published on Dec 19, 2024
Government Jobs
భారత వాయుసేనలో అగ్నివీర్ వాయు పోస్టులు
భారత వాయుసేనలో అగ్నివీర్ వాయు పోస్టులు

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన భారత వాయుసేన అగ్నిపథ్‌ స్కీంలో భాగంగా అగ్నివీర్‌ వాయు నియామకాలకు సంబంధించి నోటిషికేషన్‌ విడుదల చేసింది. అగ్నివీర్ వాయు(01/ 2026) ఖాళీల భర్తీకి ఐఏఎఫ్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్- అగ్నిపథ్‌ స్కీం కింద అగ్నివీర్ వాయు(01/ 2026) బ్యాచ్ నియామకం

వివరాలు:

అర్హత: కనీసం 50 శాతం మార్కులతో మ్యాథమెటిక్స్‌, ఫిజిక్స్‌, ఇంగ్లిష్‌ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్‌(10+2)/ ఇంటర్మీడియట్‌(సైన్స్ కాని ఇతర సబ్జెక్టులు) లేదా మూడేళ్ల ఇంజినీరింగ్‌ డిప్లొమా (మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ ఆటోమొబైల్/ కంప్యూటర్ సైన్స్/ ఇన్‌స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)/ తత్సమాన ఉత్తీర్ణత. నిర్దిష్ట శారీరక దారుఢ్య/ వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి.

వయోపరిమితి: 01-01-2005 నుంచి 01-07-2008 మధ్య జన్మించి ఉండాలి.

ఎత్తు: పురుషులు 152 సెం.మీ; మహిళలు 152 సెం.మీ. ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: ఫేజ్-1 (ఆన్‌లైన్ రాత పరీక్ష), ఫేజ్-2 (ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, అడాప్టబిలిటీ టెస్ట్-1, అడాప్టబిలిటీ టెస్ట్-2), ఫేజ్-3 (మెడికల్ ఫిట్‌నెస్ టెస్ట్), ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

పరీక్ష ఫీజు: రూ.550.

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 07-01-2025.

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు  చివరి తేదీ: 27-01-2025.

ఆన్‌లైన్ పరీక్షలు ప్రారంభం: 22-03-2025.

ఎంపిక జాబితా వెల్లడి: 14-11-2025.

Website:https://agnipathvayu.cdac.in/AV/