ప్రతిష్ఠాత్మక భారత వ్యవసాయ పరిశోధన సంస్థ (ఐఏఆర్‌ఐ, దిల్లీ) డైరెక్టర్‌గా చెరుకుపల్లి శ్రీనివాసరావు 2024, డిసెంబరు 26న నియమితులయ్యారు.
ఈ పదవిని చేపట్టిన తొలి తెలుగు వ్యక్తి, శాస్త్రవేత్త ఈయనే. శ్రీనివాసరావు స్వస్థలం ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట సమీపంలోని అనిగండ్లపాడు.
బాపట్ల వ్యవసాయ కళాశాలలో 1982-86లో ఏజీ బీఎస్సీ, 1986-88 వరకు పీజీ చదివారు.
భారత వ్యవసాయ పరిశోధన సంస్థలో పీహెచ్‌డీ చేశారు. 1992లో శాస్త్రవేత్తగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు.