2024లో భారతదేశ వృద్ధి రేటు 7.2 శాతంగా నమోదు కావొచ్చని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ రేటింగ్స్ అంచనా వేసింది. అదేవిధంగా 2025లో 6.6%, 2026లో 6.5% చొప్పున వృద్ధి ఉండొచ్చని మూడీస్ పేర్కొంది. స్వల్పకాలంలో రిటైల్ ద్రవ్యోల్బణం కాస్త పెరిగినా.. రాబోయే నెలల్లో ఆర్‌బీఐ నిర్దేశించుకున్న లక్ష్యం దిశగా అది పయనించగలదని మూడీస్ పేర్కొంది.