ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో భారత వృద్ధి అంచనాను 6.3 శాతానికి ప్రపంచ బ్యాంక్ తగ్గించింది. అంతర్జాతీయ ఆర్థిక బలహీనతలు, విధాన అనిశ్చితులు ఇందుకు కారణమని తెలిపింది. ఇంతకు ముందు భారత వృద్ధిరేటు 6.7 శాతంగా ఉండొచ్చని బ్యాంక్ అంచనా వేసింది. ప్రైవేట్ పెట్టుబడులు నెమ్మదించడం, ప్రభుత్వ వ్యయాలు లక్ష్యాలను చేరుకోకపోవడంతో 2024-25లో వృద్ధి నిరుత్సాహపరిచిందని ప్రపంచ బ్యాంక్ వెల్లడించింది. 2024-25లో భారత్ 6.5% వృద్ధిని సాధించినట్లు తెలిపింది.