Published on May 20, 2025
Current Affairs
భారత్‌-మాల్దీవుల ఒప్పందం
భారత్‌-మాల్దీవుల ఒప్పందం

భారత గ్రాంట్‌ సహాయం కింద మాల్దీవులలో 13 నూతన ప్రాజెక్టుల అమలుకు  సంబంధించిన అవగాహన ఒప్పందాలపై రెండు దేశాలు తాజాగా సంతకాలు చేశాయి.

మాల్దీవుల్లో భారత హైకమిషనర్‌ జి.బాలసుబ్రమణియన్, మాల్దీవుల విదేశాంగ మంత్రి అబ్దుల్లా ఖలీల్, ఆ దేశ రవాణా, పౌర విమానయాన మంత్రి మొహమ్మద్‌ అమీన్‌ ఈ ఒప్పందాలపై సంతకం చేశారు. 

భారత గ్రాంట్‌ సహాయ పథకం ద్వారా హై ఇంపాక్ట్‌ కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌(హెచ్‌ఐసీడీపీ) మూడో దశ కింద అమలు చేయాల్సిన ఈ 13 ప్రాజెక్టులకు సంబంధించి సుమారు రూ.55 కోట్లను వెచ్చించనున్నారు.

మాల్దీవులలో ఫెర్రీ సేవలను మెరుగుపరచడం, ప్రజా రవాణాను విస్తరించడం, కమ్యూనిటీ జీవనోపాధిని పెంపొందించడమే ఈ ప్రాజెక్టుల లక్ష్యం.