Published on Mar 13, 2025
Current Affairs
భారత్, మారిషస్‌ భాగస్వామ్యం
భారత్, మారిషస్‌ భాగస్వామ్యం

భారత్, మారిషస్‌ దేశాలు వాణిజ్యం, సముద్ర భద్రత లాంటి వివిధ రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకునే దిశగా 8 ఒప్పందాలను 2025, మార్చి 12న కుదుర్చుకున్నాయి.

సరిహద్దు లావాదేవీల్లో స్థానిక కరెన్సీని ప్రొత్సహించడం, సముద్ర సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం, నగదు అక్రమ చలామణిపై ఉమ్మడి పోరు, సూక్ష్మ - చిన్న - మధ్యతరహా పరిశ్రమల రంగానికి సహకారం పెంపు లాంటి అంశాలను తాజా ఒడంబడికల్లో ప్రస్తావించారు.

భారత ప్రధాని మోదీ, మారిషస్‌ ప్రధానమంత్రి నవీన్‌చంద్ర రామ్‌గులాంల సమక్షంలో సంబంధిత అధికారులు ఒప్పందాలపై సంతకాలు చేశారు.

అంతకుముందు ఇద్దరు నేతలు కీలక అంశాలపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా దక్షిణార్థ గోళ దేశాలపై భారత నూతన దృక్కోణాన్ని మోదీ ప్రకటించారు.

దానికి మహాసాగర్‌ (మ్యూచువల్‌ అండ్‌ హోలిస్టిక్‌ అడ్వాన్స్‌మెంట్‌ ఫర్‌ సెక్యూరిటీ అండ్‌ గ్రోత్‌ ఎక్రాస్‌ రీజియన్స్‌) అని పేరు పెట్టారు.