దేశంలోనే అతిపెద్ద వాహన ప్రదర్శన అయిన ‘భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025’ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2025, జనవరి 17న దిల్లీలో ప్రారంభించారు.
2024లో దేశంలో అన్ని రకాల వాహనాలు కలిపి 2.5 కోట్ల మేర విక్రయమయ్యాయని.. నాలుగేళ్లలోనే 36 బిలియన్ డాలర్ల (సుమారు రూ.3.10 లక్షల కోట్ల) విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఈ రంగం ఆకర్షించిందని మోదీ తెలిపారు.
భారత్‌లో తయారీ, పీఎల్‌ఐ పథకాలతో రూ.2.25 లక్షల కోట్లకు పైగా విలువైన అమ్మకాలు జరిగాయని, 1.5 లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలు వచ్చాయని ప్రధాని వెల్లడించారు.