Published on Nov 22, 2025
Current Affairs
భారత నైపుణ్యాల నివేదిక-2026
భారత నైపుణ్యాల నివేదిక-2026
  • ఉద్యోగాలు చేసేందుకు అవసరమైన నైపుణ్యాలు కలిగిన వారు దేశవ్యాప్తంగా 56.35% మంది ఉన్నట్లు భారత నైపుణ్యాల నివేదిక-2026 వెల్లడించింది. ఉద్యోగ అర్హత నైపుణ్యాలున్న వారిలో ఉత్తర్‌ప్రదేశ్‌ (78.64%) మొదటి స్థానంలో నిలవగా.. ఆ తర్వాత స్థానాల్లో మహారాష్ట్ర (75.42%), కర్ణాటక (73.85%), కేరళ (72.16%), దిల్లీ (71.25%) నిలిచాయి. ఏఐసీటీఈ, సీఐఐ సహకారంతో వీబాక్స్‌ సంస్థ నిర్వహించిన ఈ సర్వే నివేదికను తాజాగా విడుదల చేశారు. 
  • సర్వేలో భాగంగా దేశవ్యాప్తంగా మొత్తం 7 లక్షల మందికి గ్లోబల్‌ ఎంప్లాయిబిలిటీ టెస్ట్‌(గెట్‌) నిర్వహించగా.. ఇందులో 60% పైగా మార్కులు సాధించిన వారు 56.35% మంది ఉన్నారు. మహిళలు పని చేయడానికి ఇష్టపడే మొదటి 10 రాష్ట్రాల్లో ఏపీ నాలుగో స్థానంలో నిలిచింది. దీనికి ముందు రాజస్థాన్, కేరళ, తెలంగాణ వరుసగా ఉన్నాయి.