Published on Jan 16, 2026
Current Affairs
భారత్‌ నుంచి చైనాకు పెరిగిన ఎగుమతులు
భారత్‌ నుంచి చైనాకు పెరిగిన ఎగుమతులు

భారత్‌ నుంచి చైనాకు 2024తో పోలిస్తే 2025లో 5.5 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.49,500 కోట్ల) ఎగుమతులు పెరిగాయని చైనాకు చెందిన కస్టమ్స్‌ విభాగం 2026, జనవరి 14న విడుదల చేసిన వార్షిక వాణిజ్య గణాంకాలు వెల్లడించాయి. ఇదే సమయంలో వాణిజ్య లోటు కూడా రికార్డు స్థాయిలో 116.12 బి.డాలర్ల (సుమారు రూ.10.45 లక్షల కోట్ల)కు చేరింది. ద్వైపాక్షిక వాణిజ్యం కూడా జీవన కాల గరిష్ఠమైన 155.62 బి.డాలర్ల (సుమారు రూ.14 లక్షల కోట్ల)కు చేరింది. 

2025 జనవరి-డిసెంబరు మధ్య చైనాకు భారత ఎగుమతులు 19.75 బి.డాలర్ల (సుమారు రూ.1.78 లక్షల కోట్ల)కు చేరాయి. 2024తో పోలిస్తే 9.7 శాతం (5.5 బి.డాలర్లు) పెరిగాయి. ఇదే సమయంలో మన దేశానికి చైనా ఎగుమతులు 12.8 శాతం మేర పెరిగి 135.87 బి.డాలర్ల (సుమారు రూ.12.22 లక్షల కోట్ల)కు చేరాయి.