భారత నౌకాదళానికి అధునాతనమైన రఫేల్-మెరైన్ జెట్‌ల కోసం భారత్, ఫ్రాన్స్ ప్రభుత్వాల మధ్య రూ.64వేల కోట్ల ఒప్పందంపై 2025, ఏప్రిల్ 28న సంతకాలు జరిగాయి.
దీనికింద 26 రఫేల్-ఎం జెట్‌లు మన దేశానికి అందుతాయి. వీటిలో 22 సింగిల్ సీటర్ ఫైటర్లు కాగా.. మిగతావి రెండు సీట్ల ట్రైనర్ వెర్షన్‌కు చెందినవి.
ఈ యుద్ధవిమానాలను విమానవాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్‌పై మోహరిస్తారు.
తాజా ఒప్పందంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఫ్రాన్స్ సాయుధ దళాల మంత్రి సెబాస్టియన్ లెకోర్నులు సంతకాలు చేశారు.
రఫేల్-ఎంను ఫ్రాన్స్‌కు చెందిన దసో ఏవియేషన్ సంస్థ ఉత్పత్తి చేస్తోంది. భారత వైమానిక దళం వద్ద ఇప్పటికే 36 రఫేల్ జెట్‌లు ఉన్నాయి.