నేలపైనే విమాన వేగంతో ప్రయాణించగల వ్యవస్థకు సంబంధించిన పరిజ్ఞానాలను పరీక్షించడానికి ఉద్దేశించిన దేశ తొలి హైపర్‌లూప్ టెస్ట్ ట్రాక్ సిద్ధమైంది.
422 మీటర్ల పొడవైన ఈ ట్రాక్‌ను రైల్వే మంత్రిత్వశాఖ తోడ్పాటుతో మద్రాస్ ఐఐటీ అభివృద్ధి చేసింది.
ఈ తరహా రవాణా వ్యవస్థ సాకారమైతే 350 కిలోమీటర్ల దూరంలోని గమ్యస్థానాన్ని అరగంటలోపే చేరుకోవచ్చు.
హైపర్‌లూప్‌ను అయిదో రవాణా విధానంగా అభివర్ణిస్తారు. ఇది సుదూర ప్రయాణాలకు ఉద్దేశించిన హైస్పీడ్ రవాణా వ్యవస్థ.
ఇందులో శూన్యంతో కూడిన గొట్టాలు ఉంటాయి. వీటిలో రైలు బోగీలను పోలిన పాడ్‌లు అత్యంత వేగంతో ప్రయాణిస్తాయి.