భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత తీరరక్షక దళం కోస్ట్ గార్డ్ ఎన్రోల్డ్ పర్సనల్ టెస్ట్ (సీజీఈపీటీ)-02/ 2025 బ్యాచ్ ద్వారా నావిక్ (జనరల్ డ్యూటీ), నావిక్ (డొమస్టిక్ బ్రాంచ్) ఉద్యోగాల భర్తీకి అర్హులైన పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టులు: 300
వివరాలు:
1. నావిక్ (జనరల్ డ్యూటీ): 260 పోస్టులు
రీజియన్/ జోన్ వారీ ఖాళీలు: నార్త్- 65; వెస్ట్- 53; ఈస్ట్- 38; సౌత్- 54, సెంట్రల్- 50.
2. నావిక్(డొమస్టిక్ బ్రాంచ్): 40 పోస్టులు
రీజియన్/ జోన్ వారీ ఖాళీలు: నార్త్- 10; వెస్ట్- 09; ఈస్ట్- 05; సౌత్- 09, సెంట్రల్- 07.
అర్హత: నావిక్ జనరల్ పోస్టులకు 12వ తరగతి (మ్యాథ్స్/ ఫిజిక్స్), నావిక్ డొమస్టిక్ బ్రాంచ్ పోస్టులకు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 18 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే 01-09-2003 నుంచి 28-08-2007 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు వర్తిస్తుంది.
ప్రాథమిక వేతనం: నెలకు రూ.21,700.
ఎంపిక విధానం: స్టేజ్-1, స్టేజ్-2, స్టేజ్-3, స్టేజ్-4 పరీక్షలు, వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు.
పరీక్ష రుసుము: రూ.300 (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది).
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 25-02-2025.
పరీక్ష తేదీలు/ ఈ-అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్:
స్టేజ్-I: ఏప్రిల్ 2025.
స్టేజ్-II: జూన్ 2025.
స్టేజ్-III: సెప్టెంబర్ 2025.
Website:https://cgept.cdac.in/icgreg/candidate/login