Published on May 31, 2025
Government Jobs
భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌లో మేనేజర్‌ పోస్టులు
భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌లో మేనేజర్‌ పోస్టులు

భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్‌) హైదరాబాద్ మార్కెటింగ్ అండ్‌ బీడీ విభాగాల్లో సీనియర్‌ మేనేజర్‌, మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 05

వివరాలు:

విభాగాలు: మార్కెటింగ్ అండ్ బీడీ

పోస్టు పేరు-ఖాళీలు

1. సీనియర్‌ మేనేజర్‌: 04

2. మేనేజర్‌: 01

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 

వయోపరిమితి: మేనేజర్‌కు 40 ఏళ్లు, సీనియర్‌ మేనేజర్‌కు 45 ఏళ్లు ఉండాలి.  

వేతనం: నెలకు మేనేజర్‌కు రూ.60,000 - 1,80,000, సీనియర్‌ మేనేజర్‌కు రూ.70,000 - రూ.2,00,000.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తుకు చివరి తేదీ: 2025 జూన్‌ 16.

చిరునామా: ఎస్.ఎం, సి-హెచ్ఆర్(టీఏ & సీపీ), కార్పొరేట్ ఆఫీస్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్, గచ్చిబౌలి, హైదరాబాద్-500032.

Website:https://bdl-india.in/recruitments