Published on Jun 12, 2025
Walkins
భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌లో ఇంజినీర్‌ పోస్టులు
భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌లో ఇంజినీర్‌ పోస్టులు

భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్‌) హైదరాబాద్ ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 18

వివరాలు:

విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌, మెకానికల్, ఫిట్టర్‌, ఎలక్ట్రానిక్‌ మెకానిక్‌/రేడియో మెకానిక్‌

1. ప్రాజెక్ట్‌ ఇంజినీర్: 06

2. ప్రాజెక్ట్‌ డిప్లొమా అసిస్టెంట్: 05

3. ప్రాజెక్ట్‌ ట్రేడ్‌ అసిస్టెంట్(ఫిట్టర్‌): 05

4. ప్రాజెక్ట్ ట్రేడ్‌ అసిస్టెంట్(ఎలక్ట్రానిక్ మెకానిక్/రేడియో మెకానిక్‌): 02

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్‌, ఎంఈ/ఎంటెక్‌, డిప్లొమా, ఐటీఐలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 

వయోపరిమితి: ఇంటర్వ్యూ తేదీ నాటికి అభ్యర్థులకు 28 - 33 ఏళ్లు ఉండాలి.

వేతనం: ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌కు నెలకు రూ.30,000 - రూ.39,000, ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్‌కు రూ.25,000 - రూ.29,000, ప్రాజెక్ట్‌ ట్రేడ్‌ అసిస్టెంట్‌కు రూ.23,000 - రూ.27,000.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.

ఇంటర్వ్యూ తేదీ: 2025 జూన్‌ 15.

వేదిక: భారత్ డైనమిక్స్ లిమిటెడ్, జీ-బ్లాక్, ఏపీఐఐసీ-ఐఏఎల్‌ఏ, ఫఖెరటాకియా గ్రామం, వీఎస్‌ఈజెడ్‌ పోస్ట్, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ - 530049.

Website:https://bdl-india.in/recruitments