భారత క్రికెట్ టెస్టు జట్టుకు ఇకపై శుభ్‌మన్ గిల్ సారథ్యం వహించనున్నాడు. 2025, జూన్ 20న ఇంగ్లాండ్‌తో మొదలయ్యే 5 టెస్టుల సిరీస్‌కు ఇతడు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.
వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్‌ను బుమ్రా స్థానంలో వైస్ కెప్టెన్‌గా నియమించారు.
భారత టెస్టు జట్టుకు నాయకత్వం వహించనున్న అయిదో పిన్న వయస్కుడు శుభ్‌మన్ గిల్. 2025, మే 24 నాటికి అతడి వయసు 25 ఏళ్ల 285 రోజులు.
పటౌడీ (21 ఏళ్ల 77 రోజులు), సచిన్ (23 ఏళ్ల 169 రోజులు), కపిల్ దేవ్ (24 ఏళ్ల 48 రోజులు), రవిశాస్త్రి (25 ఏళ్ల 229 రోజులు) ముందున్నారు.