Published on Feb 17, 2025
Current Affairs
భారత్‌ టెక్స్‌ 2025
భారత్‌ టెక్స్‌ 2025

‘భారత్‌ టెక్స్‌ 2025’ కార్యక్రమంలో 2025, ఫిబ్రవరి 16న ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు.

ప్రపంచంలో టెక్స్‌టైల్స్‌ ఎగుమతుల్లో భారత్‌ 6వ స్థానంలో ఉన్నట్లు, 2024-25లో రూ.3 లక్షల కోట్ల టెక్స్‌టైల్‌ ఎగుమతులు చేసినట్లు మోదీ తెలిపారు.

టెక్స్‌టైల్‌ రంగం 2030 నాటికి రూ.9 లక్షల కోట్ల వార్షిక ఎగుమతులే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. 

2025-26 కేంద్ర బడ్జెట్‌లో రూ.5,272 కోట్ల (బడ్జెట్‌ అంచనాలు) నిధులను టెక్స్‌టైల్స్‌ మంత్రిత్వ శాఖకు కేటాయించారు.

2024-25 ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన బడ్జెట్‌ అంచనా రూ.4,417.03 కోట్లతో పోలిస్తే ఇది 19 శాతం అధికం.