Published on Sep 17, 2025
Current Affairs
భారత జెర్సీ స్పాన్సర్‌గా అపోలో టైర్స్‌
భారత జెర్సీ స్పాన్సర్‌గా అపోలో టైర్స్‌

భారత జెర్సీ స్పాన్సర్‌గా అపోలో టైర్స్‌ 

భారత క్రికెట్‌ జట్టు జెర్సీ స్పాన్సర్‌గా అపోలో టైర్స్‌ ఎంపికైంది.

ఈ విషయాన్ని 2025, సెప్టెంబరు 16న బీసీసీఐ ప్రకటించింది.

ఆన్‌లైన్‌ గేమింగ్‌ నిరోధక చట్టం నేపథ్యంలో జెర్సీ స్పాన్సర్‌షిప్‌ నుంచి డ్రీమ్‌11 వైదొలిగింది.

కొత్త స్పాన్సర్‌ కోసం దరఖాస్తులు ఆహ్వానించిన బీసీసీఐ.. రూ.579 కోట్లతో అపోలో టైర్స్‌తో ఒప్పందం చేసుకుంది.

డ్రీమ్‌11తో ఒప్పందం (రూ.358 కోట్లు) కంటే ఇది చాలా ఎక్కువ.

2028 మార్చి వరకు ఒప్పందం అమల్లో ఉంటుంది.